ఉత్తరప్రదేశ్ అమేఠీలో హత్యకు గురైన తన అనుచరుడు సురేంద్రసింగ్ అంత్యక్రియలకు స్థానిక ఎంపీ, భాజపా నేత స్మృతి ఇరానీ హాజరయ్యారు. సురేంద్ర భౌతిక కాయానికి నివాళి అర్పించిన స్మృతి, అతని పాడె మోశారు.
అమేఠీ జిల్లా బరౌలియా గ్రామానికి చెందిన 50 ఏళ్ల సురేంద్ర సింగ్ స్మృతి ఇరానీ అనుచరుడు. శనివారం రాత్రి ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతనిని లఖ్‌నవూలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేంద్రసింగ్ మృతి చెందారు.