తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్మృతి ప్రమాణం చేస్తుంటే ఏం జరిగిందంటే... - మోదీ

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎంపీగా ప్రమాణం చేస్తుండగా ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులందరూ చప్పట్లతో అభినందించారు. అమేఠీ​ లోక్​సభ స్థానంలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై గెలుపొందారు స్మృతి.

స్మృతి ప్రమాణం చేస్తుంటే ఏం జరిగిందంటే...

By

Published : Jun 17, 2019, 2:30 PM IST

కరతాళ ధ్వనుల మధ్య స్మృతి ప్రమాణం

లోక్​సభ ఎంపీగా.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రమాణ స్వీకారం హర్షధ్వానాల నడుమ సాగింది. ప్రొటెం స్పీకర్​ స్మృతి ఇరానీ పేరు పిలవగానే సభలోని ఎన్డీఏ సభ్యులందరూ చప్పట్లతో ఘనస్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం ఆద్యంతం కరతాళ ధ్వనుల మధ్య సాగింది.

అనంతరం ప్రొటెం స్పీకర్​కు ధన్యవాదాలు తెలిపిన స్మృతి.. సభలోని సోనియా గాంధీ సహా విపక్ష నేతలందరికీ అభివాదం చేస్తూ ముందుకెళ్లారు.

కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ... ఉత్తర్​ప్రదేశ్​ అమేఠీ లోక్​సభ స్థానం నుంచి రాహుల్​గాంధీపై ఘనవిజయం సాధించారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్​ కంచుకోటగా ఉన్న ఇక్కడ 55 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు

ఇదీ చూడండి:- పెళ్లి కార్డు రూ. 8లక్షలు... పెళ్లి ఖర్చు 200కోట్లు!

ABOUT THE AUTHOR

...view details