తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంధుల కోసం అధునాతన స్మార్ట్​ వాకింగ్​ స్టిక్​

అంధుల కోసం గుజరాత్​ విద్యార్థులు అద్భుత ఆవిష్కరణకు నాంది పలికారు. గుంతలు, నీటితో నిండిన ప్రదేశాలు, చీకటి ప్రాంతాల్లో వెళ్లేటప్పుడు ఎలాంటి హాని కలుగకుండా ఉండేలా అల్ట్రాసోనిక్​ వాకింగ్​ స్టిక్​ను కనుగొన్నారు.

స్మార్ట్​ వాకింగ్​ స్టిక్​

By

Published : Jun 9, 2019, 12:38 PM IST

అంధుల కోసం గుజరాత్​ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ

కంటి చూపు లేక నడవడానికి ఇబ్బంది పడుతున్న వారి కోసం ఓ ప్రత్యేక 'వాకింగ్​ స్టిక్'​ను తయారు చేశారు గుజరాత్​ విద్యార్థులు. గుంతలు, నీటితో నిండిన ప్రదేశాలు, చీకటి ప్రాంతాల్లో వెళ్లేటప్పుడు అంధులకు ఎలాంటి హాని కలుగకుండా ఉండేలా అల్ట్రాసోనిక్​ వాకింగ్​ స్టిక్​ను కనుగొన్నారు. సూరత్​ జిల్లాలోని బార్దోలీ తాలూకాలో ఉన్న ఎన్​జీ పటేల్​ పాలిటెక్నిక్​ కళాశాల విద్యార్థులు ఈ నూతన ఆవిష్కరణకు నాంది పలికారు.

ఎలా పనిచేస్తుంది?

వాకింగ్​ స్టిక్​లో 4 సెన్సార్లు ఉంటాయి. 50 సెంటీమీటర్ల లోపు ఏదైనా ప్రమాదం ఉందని గుర్తిస్తే... వెంటనే ఇందులో అమర్చిన స్పీకర్లు హెచ్చరికలు పంపుతాయి. అప్పుడు ప్రమాదానికి గురి కాకుండా అంధులు తమ నడకను ఆపవచ్చు.

" ఈ స్టిక్​లో మొత్తం నాలుగు సెన్సార్లు అమర్చి ఉంటాయి. ఇవి మనం నడిచేటప్పుడు ఎదురుగా ఉండే ఆటంకాలు, నీరు, చీకటిని గుర్తిస్తాయి. అలాగే స్టిక్​ ఎక్కడైనా పోగొట్టుకుంటే రిమోట్​ సాయంతో తెలుసుకునేందుకు వీలుగా నాలుగో సెన్సార్​ ఉపయోగపడుతుంది."
-దీపక్​ కుస్వాచే, విద్యార్థి

ప్రపంచవ్యాప్తంగా దాదాపు దాదాపు 3.9 కోట్ల మంది అంధులున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. వీరందరూ ఒక చోటు నుంచి వేరే చోటుకు వెళ్లేందుకు ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఈ అధునాతన వాకింగ్​స్టిక్ అంధులకు​ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు రూపొందించిన విద్యార్థులు.

ఇదీ చూడండి : విహారి: ఆ ఆలయంలో పూజలన్నీ ప్రకృతికే

ABOUT THE AUTHOR

...view details