తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​- బంగ్లా సరిహద్దు 'స్మార్ట్​ ఫెన్స్'​ వచ్చే ఏడాది పూర్తి - telugu naitonal news

అసోంలోని భారత్​- బంగ్లాదేశ్​ సరిహద్దు మీదుగా అధునాతన​ కంచెను ఏర్పాటు చేసే ప్రాజెక్టు.. వచ్చే ఏడాది జులై నాటికి పూర్తవుతుందని బీఎస్ఎఫ్​ డీజీ వీకే జోహ్రి తెలిపారు.

'Smart fence' along riverine Bangla border in Assam by July 2020: BSF DG
భారత్​- బంగ్లా సరిహద్దు 'స్మార్ట్​ ఫెన్స్'​ పూర్తయ్యేది అప్పుడే

By

Published : Dec 29, 2019, 8:11 PM IST

అసోంలోని భారత్​- బంగ్లాదేశ్​ సరిహద్దు ద్వారా వలసలను అరికట్టేందుకు నిర్ణయించిన స్మార్​ ఫెన్స్​ ప్రాజెక్ట్​ వచ్చే ఏడాది పూర్తి కానుంది. ఈ మేరకు వచ్చే ఏడాది జులై నాటికి కంచె నిర్మాణం పూర్తవుతుందని సరిహద్దు భద్రతా దళం (బీఎస్​ఎఫ్​) డైరక్టర్​ జనరల్​ వీకే జోహ్రీ తెలిపారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు ఆలస్యమవుతోందన్నారు. బంగ్లాదేశ్​ సరిహద్దు భద్రతాధికారి మేజర్​ జనరల్​ షఫీనుల్​ ఇస్లాంతో కలిసి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు జోహ్రీ.

అసోంలోని బ్రహ్మపుత్ర నది మీదుగా ధుబ్రీలో సుమారు 55 కిలోమీటర్ల మేర అలారం శబ్ధంతో కూడిన సాంకేతికమైన కంచెను ఏర్పాటు చేసేందుకు బీఎస్​ఎఫ్​ కృషి చేస్తోంది. ఈ నది మీదుగా అక్రమ వలసలు, పశువుల రవాణా ఎక్కువగా సాగే అవకాశం ఉంది. జమ్ముకశ్మీర్​లోనూ పాకిస్థాన్ సరిహద్దు వెంబడి సీఐబీఎంఎస్ (సమీకృత సమగ్ర సరిహద్దు నిర్వహణ వ్యవస్థ) ​లో భాగంగా ఈ తరహా కంచెను ఏర్పాటు చేసింది బీఎస్​ఎఫ్​.

ఇదీ చూడండి: బూడిద రంగులో కేరళ అడవులు.. కారణం సీతాకోకచిలుకలు!

ABOUT THE AUTHOR

...view details