ఇస్మార్ట్ ఆవు... వరద నుంచి తెలివిగా బయటకు! - నదులు
మహారాష్ట్రలో వరద ఉద్ధృతికి నీట మునిగిన సూర్య నది వంతెనను దాటేందుకు 5 ఆవులు ప్రయత్నించాయి. వాటిలో 4 నీటిలో కొట్టుకుపోయాయి. మిగిలిన ఆవు ఎలా ప్రాణాలు దక్కించుకుంది?
మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పాల్ఘర్లో సూర్య నదిదీ అదే పరిస్థితి. అక్కడున్న వంతెన దాదాపు కనుమరుగైంది. ఆ నీటి ప్రవాహానికి ఎవ్వరైనా తట్టుకోవటం కష్టమే. 5 ఆవులు మాత్రం ఆ వంతెన దాటేందుకు ప్రయత్నించాయి. ఒకదాని వెనుక ఒకటి వరుసగా నడవసాగాయి. అందులో ఒక్కొక్కటి మెల్లగా నీటి ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోతున్నాయి.
అలా మూడు కొట్టుకుపోయాయి. నాలుగో ఆవుదీ అదే పరిస్థితి. మిగిలిన ఆవు విషయం అర్థం చేసుకుంది. వెనక్కు వెళ్లి... ప్రాణాలు దక్కించుకుంది.