తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు తపాలా సేవలు పునరుద్ధరించిన పాక్ - భారత్​తో తపాలా సేవలు పునరుద్ధరించిన పాక్

భారత్​కు తపాలా సేవలను దాయాది పాకిస్థాన్ పునఃప్రారంభించింది. కశ్మీర్​కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం తపాలా సహా, పాక్షికంగా వైమానిక సేవలు నిలిపేసింది పాక్. నేడు తపాలా సేవలు పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది.

భారత్​తో తపాలా సేవలు పునరుద్ధరించిన పాక్

By

Published : Nov 19, 2019, 3:19 PM IST

కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్​కు నిలిపివేసిన తపాలా సేవలను పునరుద్ధరించింది పాకిస్థాన్​. భారత్​ నుంచి వెళ్లే లేఖల పంపిణీపై నిషేధాన్ని ఎత్తేసింది. అయితే పార్శిల్ సేవలపై ఆంక్షలు కొనసాగుతాయని సమచారం.

ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్​తో ద్వైపాక్షిక సంబంధాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది పాక్. ఆగస్టులో తపాలా సేవలు, పాక్షికంగా వైమానిక సేవలను నిలిపేసింది దాయాది.

పాక్ నిర్ణయాలపై భారత్​ అభ్యంతరం తెలిపింది. సేవలు నిలిపివేత అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని పేర్కొంది.

ఇదీ చూడండి: భాజపాపై తీవ్రస్థాయిలో శివసేన పరోక్ష విమర్శలు

ABOUT THE AUTHOR

...view details