దిల్లీ మెట్రో బ్లూలైన్ మార్గంలోని ఓ రైలులో కొంతమంది పౌరసత్వ చట్టానికి అనుకూలంగా నినాదాలు చేశారు. కాషాయ టీ-షర్టు, కుర్తా వేసుకున్న ఆరుగురు వ్యక్తులు రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో రైలు ఆగుతున్న వేళ నినాదాలు చేయటం ప్రారంభించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తర్వాత స్టేషన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
వీరికి కొంతమంది ప్రయాణికులు జతకలిసి నినాదాలు చేశారు. మరికొంత మంది ఆ చిత్రాలను తమ చరవాణిల్లో చిత్రీకరించారు. వీరిని దిల్లీ మెట్రో భద్రత బాధ్యతలు చూసుకునే సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
"ఆరుగురు యువకులు రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో నినాదాలు చేశారు. వాళ్లను సీఐఎస్ఎఫ్ సిబ్బంది తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దిల్లీ మెట్రో రైల్ పోలీస్ అధికారులకు అప్పగించారు. మెట్రో సేవలు యథావిధిగా కొనసాగుతాయి."