ఈశాన్య రాష్ట్రం సిక్కింలో రాజకీయం రసవత్తరంగా మారింది. సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎమ్) ప్రతినిధి బృందం పార్టీ అధ్యక్షుడు పిఎస్ గోలే ఆధ్వర్యంలో గవర్నర్ గంగాప్రసాద్ను కలిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవకాశం కల్పించాలని కోరింది.
తాజా ఎన్నికల్లో రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాలకుగాను... 17 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా 'సిక్కిం క్రాంతికారి మోర్చా' అవతరించింది. అయితే ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న ప్రశ్నకు... త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పీఎస్ గోలే తెలిపారు.
ముఖ్యమంత్రి ఎవరు?
సిక్కింలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 'సిక్కిం క్రాంతికారి మోర్చా' తరఫున ముఖ్యమంత్రిగా పీఎస్ గోలేకే అవకాశం ఎక్కువగా ఉంది. తాజా ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోయినా, పార్టీ మాత్రం గోలేనే సీఎం కావాలని కోరుకుంటోంది.