తూర్పు లద్దాఖ్‌లో భారీ సంఖ్యలో చైనా సైన్యాన్ని మోహరించినట్టు భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ విషయంలో భారత్‌కు కూడా చర్యలను ముమ్మరం చేసిందని వెల్లడించారు. నెల రోజులుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఈనెల 6న సమావేశం
భారత్-చైనా మిలిటరీ అధికారుల మధ్య ఈ నెల 6న సమావేశం జరగనుందని రాజ్‌నాథ్ తెలిపారు. అయితే ఈ విషయంలో భారత్ వెనకడుగు వేయదని తేల్చి చెప్పారు.
"తూర్పు లద్దాఖ్‌లోని అతి సున్నితమైన ప్రాంతాలు తమకు చెందినవని చైనా అంటోంది. కానీ అవి మనవేనని భారత్ విశ్వసిస్తోంది. ఈ విషయంపై ఇరు వర్గాలు ఓ అంగీకారానికి రాలేకపోయాయి. భారీ సంఖ్యలో చైనీయులు అక్కడికి వచ్చారు. భారత్ చేయాల్సింది చేసింది."