హిమాచల్ ప్రదేశ్, ధర్మశాలలోని గగ్గల్ పోలీస్ స్టేషన్లో 16 నాగుపాములు పట్టబడ్డాయి. బుధవారం పోలీస్ స్టేషన్లో ఓ నాగుపాము కనిపించింది. అయితే, అదే రోజు పాములు పట్టేవారు వచ్చి నాగును తీసుకెళ్లారు. దీంతో, ఇక పాము భయం పోయిందనుకున్నారు అంతా. కానీ, ఓ ఉద్యోగి మాత్రం స్టేషన్లో ఇంకో పాము ఉన్నట్లు అనుమానించాడు. స్టేషన్ ఇన్-ఛార్జ్ మహర్దీన్ పాములు పట్టేవారిని మళ్లీ పిలిపించారు. వారు స్టేషన్ నలుమూలలూ వెతికారు. అనుమానమే నిజమైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 బాల నాగులు వారి కంటబడ్డాయి.
పోలీస్ స్టేషన్లో 16 నాగరాజులు మకాం! - 16 nakes in police station
మహామహా నేరగాళ్లనే పట్టుకొచ్చి చెండాడే పోలీసుల కళ్లుగప్పి పోలీస్ స్టేషన్లోనే మకాం వేశాయి 16 నాగరాజులు. తుపాకీలు, లాఠీలు పట్టుకు తిరగుతున్నా భయపడకుండా.. హిమాచల్ ప్రదేశ్ పోలీసులనే హడలెత్తించాయి. ఎట్టకేలకు పాములు పట్టేవారికి లొంగిపోయాయి.
పోలీస్ స్టేషన్ లో మకాం వేసిన 16 నాగరాజులు!
ఒక్కోటి దాదాపు ఒకటిన్నర అడుగుల పొడవున్న పిల్లనాగులన్నీ ఒకే తల్లి బిడ్డలుగా గుర్తించారు. వాటిని డబ్బాల్లో బంధించి పట్టుకెళ్లారు. ఆపై అడవిలో వదిలేశారు.