రాజస్థాన్ చురులోని సర్దార్షహర్ గ్రామంలో పొగమంచు కారణంగా రహదారులపై జరుగుతున్న ప్రమాదాలు అధికమవుతున్నాయి. గత రెండు రోజులుగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతుండగా... తాజాగా ట్రక్కు, జీపు ఒకదానినొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా మొత్తం ఆరుగురు మరణించారు.
జీపులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారని సంబంధిత వ్యక్తులు తెలిపారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీరు రావత్సార్ నుంచి దుంగర్గఢ్కు వెళ్తుండగా.. టమాటాలతో నిండి ఉన్న లారీ ఢీకొట్టిందని చెప్పారు.