సెప్టిక్ ట్యాంకులోని విషవాయువును పీల్చడం వల్ల ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది.
విషవాయువు పీల్చి ఆరుగురి మృతి - Six men died after inhaling toxic gases
ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఆరుగురు మృతి చెందారు. తొలుత నలుగురు కూలీలతో పాటు తర్వాత ట్యాంకులో దిగిన ఇంటి యజమాని కుమారులిద్దరు ప్రాణాలు కోల్పోయారు.

విషవాయువు పీల్చి ఆరుగురి మృతి
జిల్లాలోని దేవీపుర్ గ్రామంలో ఆదివారం ఉదయం ఓ నివాసంలో సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు నలుగురు కూలీలు దిగారు. ఆ తర్వాత ఇంటి యజమాని కుమారులిద్దరు కూడా దిగారు. చాలాసేపటి తర్వాత గ్రామస్థులు ట్యాంకు తవ్వి చూడగా.. అందరూ స్పృహ లేకుండా పడి ఉన్నారు.
దీంతో ఆరుగురినీ స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించారని వైద్యులు ప్రకటించారు. విషవాయువు పీల్చడం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టంచేశారు.