మధ్యప్రదేశ్లో ఓ కుటుంబంలోని ఆరుగురిని హత్య చేశారు వారి బంధువులు. నిందితులు.. బాధిత కుటుంబీకులు బంధువులన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇద్దరు సోదరులు ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. పాత శత్రుత్వంతోనే వారు ఈ హత్యలు చేసుండొచ్చని భావిస్తున్నారు.
ఒకే కుటుంబంలోని ఆరుగురిని హత్య చేసిన సోదరులు! - Mandla
20:20 July 15
ఒకే కుటుంబంలోని ఆరుగురిని హత్య చేసిన సోదరులు!
మండ్ల జిల్లా బిజాదండి పోలీస్ స్టేషన్ పరిధిలోని మనేరి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొనేలోపే.. నిందితుల్లో ఒకరిని స్థానికులు చంపినట్లు తెలుస్తోంది. మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై వివరాలు రాబడుతున్నారు. నిందితులను హరీశ్ సోనీ, సంతోశ్ సోనీలుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.
''ఇప్పటివరకు ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.''
- విక్రమ్ సింగ్ కుశ్వాహా, ఏఎస్పీ