అసోంలో వరదలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వరదల కారణంగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు వరదలు, కొండచరియలు విరిగిపడి మరణించినవారి సంఖ్య 76కు పెరిగింది. వీరిలో 50 మంది వరదలతో మృతి చెందగా 26 మంది కొండచరియలు విరిగిపడి మృత్యువాతపడ్డారు.
అసోంలో వరద బీభత్సం.. మరో ఆరుగురు మృతి - Assam floods death toll
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నివాస ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద కారణంగా మరో ఆరుగురు మరణించారు. మొత్తం 22 లక్షల మందిపై వరద ప్రభావం ఉంది.
అసోంలో ఆగని వరద.. 22 లక్షల మందిపై ప్రభావం
27 జిల్లాల్లో సుమారు 22 లక్షల మంది ప్రభావితమయ్యారు. అత్యధికంగా బర్పేటా జిల్లాలో 5.44 లక్షల మందికి పైగా ప్రభావితం కాగా సాల్మరలో 1.92 లక్షలు, ధేమాజీలో 1.30 లక్షల మంది వరదలతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి:పద్మనాభస్వామి ఆలయంలో ఆ గది ఇక తెరుచుకోనట్టే!
Last Updated : Jul 13, 2020, 10:39 PM IST