ఉగ్రవాదులు వరుస దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. జమ్ముకశ్మీర్ బుడ్గాం జిల్లా పఖేర్పొరా బస్టాండ్ సమీపంలో భద్రతా బలగాలపై గ్రనేడ్ దాడి చేశారు. ఈ పేలుడు ఘటనలో మొత్తం ఆరుగురు గాయపడ్డారు. ఇందులో సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఓ పోలీసు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కశ్మీర్లో గ్రనేడ్ దాడి- పోలీసు సహా ఆరుగురికి గాయాలు - CRPF
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. బుడ్గాం జిల్లాలో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు.
![కశ్మీర్లో గ్రనేడ్ దాడి- పోలీసు సహా ఆరుగురికి గాయాలు Six injured in grenade attack in central Kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7068683-thumbnail-3x2-jk.jpg)
కశ్మీర్లో గ్రనేడ్ దాడి.. పోలీసు సహా ఆరుగురికి గాయాలు
క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.