తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే ఆస్పత్రిలో గంటల వ్యవధిలో ఆరుగురు చిన్నారుల మృతి - mp latest infants died news

మధ్యప్రదేశ్​లోని షాడోల్​ జిల్లా ఆస్పత్రిలో గంటల వ్యవధిలోనే ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. చనిపోయినవారందరూ గిరిజనుల పిల్లలే కావడం గమనార్హం. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది మధ్యప్రదేశ్​ ప్రభుత్వం.

Six infants die on intervening Jan 13-14 night in MP hospital
ఒకే ఆస్పత్రిలో గంటల వ్యవధిలో ఆరుగురు చిన్నారుల మృతి

By

Published : Jan 14, 2020, 4:49 PM IST

మధ్యప్రదేశ్​లోని ప్రభుత్వాసుపత్రిలో గంటల వ్యవధిలోనే ఆరుగురు గిరిజన చిన్నారులు మరణించడం కలకలం రేపింది. గత అర్ధరాత్రి షాడోల్​ ఆస్పత్రిలో వీరు ప్రాణాలు విడిచారు. వీరిలో ఒకరు పుట్టి ఒక రోజేకాగా మిగిలిన వారి వయసు రెండున్నర నెలలు.

చిన్నారుల మరణాలపై మధ్యప్రదేశ్​ ఆరోగ్య శాఖ మంత్రి తులసి సిలావత్​ దర్యాప్తునకు ఆదేశించారు.

"ఆ చిన్నారులు విషమ పరిస్థితిలో ఆస్పత్రిలోని సిక్​ న్యూ బార్న్​ కేర్​ యూనిట్(ఎస్​ఎన్​సీయూ)లో చేరారు. కానీ వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
మరణాలకు అసలు కారణాలు దర్యాప్తు తర్వాతే తెలుస్తాయి. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉందా అన్న కోణంలోనూ విచారణ జరుగుతుంది."

-డాక్టర్​ రాజేష్​ పాండే, ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యుడు

ఆస్పత్రిని గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్​ శాఖ మంత్రి కమ్లేశ్వర్​ పటేల్​ సందర్ళించారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details