బాణసంచా కర్మాగారంలో పేలుడు- 9 మంది మృతి - బాణసంచా కర్మాగారం
12:56 September 04
బాణసంచా కర్మాగారంలో పేలుడు- 9 మంది మృతి
తమిళనాడు కడలూరులోని బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. కట్టుమన్నారుకోయిల్లోని కురుంగుడి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ వెల్లడించారు. మృతులంతా మహిళలే అని తెలిపారు.
ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ఆస్పత్రికి తరలించే క్రమంలో చనిపోయారు.
ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పేలుడు జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదం ధాటికి భవనం ధ్వంసమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.