తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీలంపుర్ 'పౌర'​ అల్లర్ల కేసులో ఆరుగురు అరెస్ట్​ - Citizenship Amendment Act PROTEST LATEST NEWS

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దిల్లీ సీలంపుర్​లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి మొత్తం ఆరుగురిని అరెస్టు​ చేశారు పోలీసులు. రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు. అల్లర్ల దృష్ట్యా ఈశాన్య దిల్లీ ప్రాంతంలో 144 సెక్షన్​ విధించారు అధికారులు.

Six arrested for Seelampur violence
శీలంపుర్​ ఘటనలో ఆరుగురు అరెస్ట్​.

By

Published : Dec 18, 2019, 11:08 AM IST

Updated : Dec 18, 2019, 3:36 PM IST

సీలంపుర్ 'పౌర'​ అల్లర్ల కేసులో ఆరుగురు అరెస్ట్​

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీ సీలంపుర్​లో మంగళవారం పలు వాహనాలు, ప్రజాఆస్తులను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ఈ ఘటనకు సంబంధించి 2 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసిన పోలీసులు... ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆందోళనలు చేసిన వారి నేరచరిత్రను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సీలంపుర్​ ప్రాంతంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఇవాళ తెల్లవారుజాము నుంచే పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ద్విచక్రవాహనాలపై తిరుగుతూ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఈశాన్య దిల్లీలో 144 సెక్షన్​..

పౌరసత్వ చట్టంపై హింసాత్మక ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. ఈశాన్య దిల్లీ ప్రాంతంలో 144 సెక్షన్​ విధించారు.

భారీగా ట్రాఫిక్​ జాం..

అల్లర్ల నేపథ్యంలో దిల్లీకి చేరుకునే వాహనాలను దారి మళ్లించారు అధికారులు. నోయిడా నుంచి వచ్చే వారిని డీఎన్​డీ, అక్షర్​ధామ్​ మార్గాల గుండా వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో మథురా రోడ్​-కాలిందీ కుంజ్​ మధ్య ఉన్న రోడ్​ నంబర్​ 13ఏ, డీఎన్​డీ ఫ్లైఓవర్​ ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఇదీ చూడండి: యోగికి వ్యతిరేకంగా స్వపక్ష సభ్యుల ధర్నా- విపక్షాల మద్దతు

Last Updated : Dec 18, 2019, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details