ముంబయిలో గ్యాస్ లీక్ అయిందంటూ వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి. ఈరోజు తెల్లవారుజామున గ్యాస్ లీక్ అయిందని పలు ప్రాంతాల నుంచి ఫోన్లు రావడం వల్ల అధికారులు ఉలిక్కిపడ్డారు. చెంబూర్, ఘాట్‌కోపర్, కంజుర్‌మార్గ్, విఖ్రోలి, పోవై ప్రాంతాల నుంచి గ్యాస్ లీక్ అయినట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని... బృహత్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. అగ్నిమాపక దళాలను ఘటనా స్థలాలకు పంపించామని.. సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు.
'గ్యాస్ లీక్' కలకలం- భయాందోళనలో ప్రజలు - ముంబయిలో గ్యాస్
ముంబయిలో గ్యాస్ లీక్ అంటూ కలకలం రేగింది. తెల్లవారుజామునే పలు ఫోన్లు రావటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో తనిఖీ చేసి ఈ వార్తలు అవాస్తవమని తెలిపారు అధికారులు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, అసత్య వార్తలు నమ్మవద్దని సూచించారు.
!['గ్యాస్ లీక్' కలకలం- భయాందోళనలో ప్రజలు Situation under control, says BMC after gas leak complaints](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7510999-thumbnail-3x2-asp.jpg)
ముంబయిలో గ్యాస్ లీక్... అప్రమత్తమైన అధికారులు
ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఇప్పటివరకూ గ్యాస్ లీక్ అయినట్లు నిర్ధరణ కాలేదని ముంబయి అగ్నిమాపక దళం స్పష్టం చేసింది. ప్రజలెవరూ భయాందోళనలకు గురికావద్దని, పుకార్లను వ్యాపింపజేయవద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే 17 ఫైర్ ఇంజన్లను ఆయా ప్రాంతాలకు పంపామని, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు.