సీఏఏపై తీవ్ర ఘర్షణలకు వేదికైన ఈశాన్య దిల్లీలో ఆదివారం నుంచి ఇప్పటివరకు మరో 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య 47కు చేరింది. ఈశాన్య దిల్లీలోని పలు నాలాల్లో ఆదివారం 4 మృతదేహాలు లభ్యమవగా.. మరొకటి నేడు బయటపడింది. ఈ మృతదేహాలకు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించారు.
అల్లర్ల ప్రభావం తీవ్రంగా ఉన్న జాఫ్రాబాద్, మౌజ్‌పుర్, బాబర్‌పుర్, చాంద్ భాగ్, శివ్ విహార్, భజన్పురాల్లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. తక్షణ సాయం అందించడానికి బాధితుల సమాచారాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
పరీక్షల నిర్వహణ..
కట్టుదిట్టమైన భద్రత మధ్య విద్యార్థులు వార్షిక పరీక్షలు రాశారు. హాజరు 92 శాతంగా నమోదైంది. ఘర్షణల కారణంగా పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.