అల్లర్లు చెలరేగిన ఈశాన్య దిల్లీలో శనివారం శాంతియుత వాతావరణం నెలకొంది. ఘర్షణల కారణంగా ప్రాణభయంతో బయటికి వెళ్లిన స్థానికులు క్రమంగా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. వీధుల్లో జనసంచారం పెరుగుతోంది.
స్థానికుల్లో భయాలను పోగొట్టేందుకు భద్రతా సిబ్బంది కవాతులు నిర్వహిస్తున్నారు. స్థానికులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దని చెబుతున్నారు.
అసత్య ప్రచారాలు నమ్మొద్దు..
ఎవరైనా అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు పోలీసులు. అంతేకాదు.. ఆ వార్తలను ఎవరికి పంపవద్దని.. అలా చేస్తే నేరంగా పరిగణిస్తామని తెలిపారు. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చేందుకు వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో దిల్లీ ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు సమాచారం.