తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'15ఏళ్ల కిందటి బిహార్​లా బంగాల్​ పరిస్థితులు'

బంగాల్​లో ప్రస్తుత పరిస్థితులపై ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పదిహేనేళ్ల క్రితం నాటి బిహార్​ను బంగాల్ తలపిస్తోందన్నారు. ఈ ఆరోపణలను ఖండించిన తృణమూల్​ కాంగ్రెస్... ఆ అధికారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తోంది.

బంగాల్​లో మరో వివాదం

By

Published : Apr 21, 2019, 7:46 AM IST

Updated : Apr 21, 2019, 8:50 AM IST

బంగాల్​లో మరో వివాదం

బంగాల్​లో ఎన్నికల వేళ రాష్ట్ర పరిస్థితులపై ఈసీ ప్రత్యేక పరిశీలకుడు చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి. బంగాల్​లో అంతర్గతంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, మరిన్ని కేంద్ర బలగాలను మోహరించాలని ఈసీ పరిశీలకుడు అజయ్​ నాయక్​ పేర్కొన్నారు.

" 15 ఏళ్ల క్రితం నాటి బిహార్ పరిస్థితులు బంగాల్​లో కనిపిస్తున్నాయి. ఆ సమయంలో పోలింగ్​ కేంద్రాల​ వద్ద కేంద్ర బలగాలతో గట్టి పహారా ఉండేది. ఇప్పుడది బంగాల్​లోనూ ప్రవేశపెట్టాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర పోలీసులపై ఇక్కడి ప్రజలకు నమ్మకం పోయింది."
-అజయ్​ నాయక్​, బంగాల్​లో ఈసీ ప్రత్యేక పరిశీలకుడు

అజయ్​ ఆరోపణలపై అధికార తృణమూల్​ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను వెంటనే ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని ప్రధాన కార్యదర్శి సుబ్రతా బక్షి డిమాండ్ చేశారు.

బంగాల్​లో మొదటి దశ పోలింగ్​లో ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా ధ్వంసమయ్యాయి. రెండో దశలోనూ డార్జిలింగ్ పరిధిలోని చోప్రా, రాయ్​గంజ్​లోని ఇస్లాంపుర్​లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

అజయ్​ నాయక్​ గతంలో బిహార్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా పని చేశారు.

ఇదీ చూడండి: 'దీదీ... తేల్చాల్సింది కుంభకోణం లెక్కలు'

Last Updated : Apr 21, 2019, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details