తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎల్​ఓసీ వెంబడి ఏ క్షణంలోనైనా ఉద్రిక్తతలు' - Situation along LoC can escalate any time: Army Chief

నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు ఎప్పుడైనా పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు  సైన్యాధ్యక్షుడు బిపిన్​ రావత్​. భారత సైన్యం అప్రమత్తంగా ఉండాలన్నారు.

rawat
'ఎల్​ఓసీ వెంబడి ఏ క్షణంలోనైనా ఉద్రిక్తతలు'

By

Published : Dec 18, 2019, 7:26 PM IST

Updated : Dec 18, 2019, 11:46 PM IST

'ఎల్​ఓసీ వెంబడి ఏ క్షణంలోనైనా ఉద్రిక్తతలు'

భారత సైన్యాధిపతి బిపిన్​ రావత్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు ఏ క్షణంలోనైనా పెరిగే అవకాశముందన్నారు. ఇందుకు భారత సైన్యం సిద్ధంగా ఉండాలని తెలిపారు. బలగాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

"నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఏ సమయంలోనైనా పెరగొచ్చు. మనం వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధులమై ఉండాలి."

-బిపిన్ రావత్, సైన్యాధ్యక్షుడు.

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370ని కేంద్రం రద్దు చేసిన అనంతరం నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ పదేపదే​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో రావత్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. 2019 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ 950 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని లోక్​సభ వేదికగా గతనెలలో వెల్లడించారు హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్​రెడ్డి.

ఇదీ చూడండి: ఉరిశిక్ష తప్పించుకోవడానికి నిర్భయ దోషి 'న్యాయ' ప్రయత్నం!

Last Updated : Dec 18, 2019, 11:46 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details