తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీతమ్మ రికార్డు: ఏకధాటిగా 160 నిమిషాల ప్రసంగం - undefined

బడ్జెట్​ ప్రతిని 160 నిమిషాలు ఏకధాటిగా  చదివారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. శరీరం సహకరించకపోయినా.. ప్రసంగాన్ని పూర్తిచేశారు.

BUDGET-SITHARAMAN-SPEECH
BUDGET-SITHARAMAN-SPEECH

By

Published : Feb 1, 2020, 2:29 PM IST

Updated : Feb 28, 2020, 6:47 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బడ్జెట్​ను ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచి విరామం లేకుండా రికార్డు సమయం ప్రసంగించారు. 160 నిమిషాల పాటు ఏకధాటిగా పద్దు ప్రతిని చదివారు.

రెండున్నర గంటలకుపైగా సమయం పట్టడం వల్ల నిర్మల ఇబ్బంది పడ్డారు. అంతసమయం ఏకధాటిగా చదవడం వల్ల ఆమె కాస్త నీరసపడ్డారు. ముఖానికి చెమటలు పట్టాయి. మంచినీళ్లు తాగి, కొన్ని క్షణాలు విరామం తీసుకున్నా మార్పు లేదు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నిర్మల పరిస్థితిపై ఆరా తీశారు. బాగానే ఉందా లేదా విశ్రాంతి తీసుకుంటారా? అని అడిగారు.

సీతమ్మ రికార్డు-ఏకధాటిగా 160 నిమిషాల ప్రసంగం

అయినా ధైర్యంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు ఆర్థిక మంత్రి. శరీరం పూర్తిగా సహకరించని నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగాన్ని కుదించారు. స్పీకర్​ ఓంబిర్లా అనుమతితో చివరి రెండు పేజీలను చదవలేదు.

రికార్డు ప్రసంగం

బడ్జెట్​కు సంబంధించి ఇప్పటివరకు ఇదే సుదీర్ఘ ప్రసంగం. నిర్మల 2017లో 2 గంటల 17 నిమిషాల చదివారు. ఇప్పుడు తన రికార్డు తనే బద్ధలు కొట్టారు.

Last Updated : Feb 28, 2020, 6:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details