సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో ఉత్తర్ ప్రదేశ్ హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సహా ఉన్నతాధికారుల బృందం హాథ్రస్‌లో పర్యటించింది. బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంది. దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. ఆ గ్రామంలో ఆడపిల్లలకు శాశ్వత రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చింది.
ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బాధితురాలి కుటుంబం లేవనెత్తిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని విచారిస్తుందని స్పష్టం చేశారు యూపీ అదనపు ముఖ్య కార్యదర్శి అవనీష్ అవస్తి. యువతి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన ఉన్నతాధికారుల బృందం.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను యోగి ఆదిత్యనాథ్‌కు సమర్పించనున్నట్లు తెలిపారు.