తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణా పాఠశాలల్లో 'గుంజీల యోగా'! - health_education

హరియాణా పాఠశాలల్లో ఇకపై విద్యార్థులను ఏ తప్పు చేయకున్నా తప్పనిసరిగా గుంజీలు తీయిస్తారు. అవును, అక్కడి విద్యా శాఖ నిర్ణయమిది. విద్యార్థుల మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచేందుకు వారు ప్రవేశపెట్టిన కొత్త నియమమిది.

హర్యానా పాఠశాలల్లో గుంజీలు తప్పనిసరి

By

Published : Jul 6, 2019, 6:16 AM IST


విద్యార్థుల మేథో శక్తిని పెంచడానికి పాఠశాలల్లో గుంజీలను తప్పనిసరి చేస్తుంది హరియాణా ప్రభుత్వం. రోజూ ఉదయాన్నే 14 గుంజీలు తీయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా అంది ఉత్తేజితమౌతుందని ఈ నియమం పెట్టారు. యోగాను ప్రోత్సహించాలనే ప్రధాన మంత్రి ఆలోచనను ఆచరిస్తూ ప్రతి ఉదయం ప్రార్థనా సమయంలో గుంజీలను తప్పనిసరి చేస్తున్నట్లుగా ప్రకటించింది విద్యా శాఖ. గుంజీలు మెదడుకు చక్కని యోగా అని చెబుతున్నారు అక్కడి అధికారులు.

"ఇకపై పాఠశాలల్లో రోజూ పొద్దున్నే విద్యార్ధులు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తారు. గుంజీలు తీయడం శిక్ష కాదు.. ఇదో సూపర్​ బ్రెయిన్​ యోగా. ఇది శాస్త్రీయంగా రుజువైంది."-రాజీవ్ కుమార్​, హరియాణా విద్యా శాఖ కార్యదర్శి.

తరుచూ చెవులు పట్టుకుని గుంజీలు తీయడం ద్వారా మతిమరుపు పోతుందని శాస్త్రీయంగా నిరూపితమైందని, అందుకే విద్యార్థులకు అలవాటు చేస్తున్నామని హరియాణా విద్యాశాఖ కార్యదర్శి చెప్పారు.

ఇదీ చూడండి: బతికుండగానే మరణ ధ్రువీకరణపత్రం..
!

ABOUT THE AUTHOR

...view details