కేరళలో కొవిడ్ విజృంభిస్తోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 6477 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజు కేసుల్లో ఇవే అత్యధికం. మరో 22 మంది చనిపోగా.. మొత్తం మరణాలు 635కు చేరాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు లక్షా 59 వేల 933కు చేరాయి.
కేరళలో కరోనా ఉగ్రరూపం- ఒక్కరోజే 6,477 కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేరళలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం రికార్డు స్థాయిలో 6,477 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసులు లక్షా 59 వేలు దాటాయి. దిల్లీలో 3,827 కొత్త కేసులొచ్చాయి.
కేరళలో కరోనా ఉగ్రరూపం- ఒక్కరోజే 6,477 కేసులు
మహారాష్ట్రలో మరో 17, 794 మందికి వైరస్ సోకింది. రికార్డు స్థాయిలో 19 వేల 592 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 416 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 13 లక్షల మార్కు దాటాయి. మొత్తం మరణాలు 34 వేల 761కి చేరాయి.
- తమిళనాడులో ఇవాళ 5,679 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 72 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 9 వేల 148కి చేరింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 5 లక్షల 69 వేల 370కి చేరాయి.
- దిల్లీలో మరో 3,827 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసులు 2.64 లక్షలు దాటాయి. ఇప్పటివరకు దేశరాజధానిలో 5147 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం 4,519 మంది కరోనా బారినపడ్డారు. మరో 84 మంది కొవిడ్‌కు బలయ్యారు.