దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే మరో 83 వేల మందికిపైగా కొవిడ్ బారినపడ్డారు. మరో 1043 మరణాలు నమోదయ్యాయి.
భారత్లో ఒక్కరోజే 83,883 కేసులు.. 1043 మరణాలు - కొవిడ్ వార్తలు
భారత్లో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కేసుల్లో అగ్రస్థానంలో ఉంటోంది. బుధవారం ఒక్కరోజే 83 వేల 883 కేసులు నమోదయ్యాయి. మరో 1043 మంది చనిపోయారు. మొత్తం కేసులు 38 లక్షలు దాటాయి.
![భారత్లో ఒక్కరోజే 83,883 కేసులు.. 1043 మరణాలు Single-day spike of 83,883 new positive cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8659483-thumbnail-3x2-india.jpg)
భారత్లో ఒక్కరోజే 83,883 కేసులు.. 1043 మరణాలు
బుధవారం రికార్డు స్థాయిలో 11 లక్షల 72 వేల 179 నమూనాలను పరీక్షించారు. దేశవ్యాప్తంగా మొత్తం టెస్టుల సంఖ్య 4 కోట్ల 55 లక్షలు దాటింది. రోజూ టెస్టుల సంఖ్య సగటున 10 లక్షలు మించుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
బాధితులు కూడా వేగంగా కోలుకుంటున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో రికవరీ రేటు 77.09 శాతానికి చేరుకుంది. మరణాల రేటు 1.75కి తగ్గింది.
Last Updated : Sep 3, 2020, 12:59 PM IST