పెళ్లి రోజున వధూవరులు పట్టువస్త్రాలు ధరించి.. ఒంటి నిండా నగలు, పూలమాలలతో వైభవంగా ఉంటారు. ఈ కరోనాకాలంలో వీటితోపాటు మాస్క్ తప్పనిసరిగా ధరిస్తున్నారు. అయితే, అంత అందంగా అలంకరించుకుని అందరిలానే సాధారణ మాస్కులు ధరిస్తే ఎలా? అందుకే, వారి దుస్తులకు మ్యాచ్ అయ్యేలా ఓ అందమైన వెండి 'మాస్కాభరణం' తయారు చేశాడు మహారాష్ట్ర కల్హాపుర్కు చెందిన నగర వ్యాపారి సందీప్ సంగావకర్.
కరోనా విజృంభణతో మానవాళి జీవితాల్లో మాస్కులు తప్పనిసరి అయ్యాయి. ఈ కాలంలో పెళ్లి చేసుకునే జంటలకు మాత్రం సాధారణ మాస్కులు కాకుండా కాస్త ప్రత్యేక మాస్క్‌ను తయారు చేస్తే బాగుంటుందనుకున్నాడు సందీప్. అనుకున్నదే ఆలస్యంగా వైరస్ నుంచి కాపాడే వినూత్న వెండి మాస్క్‌ను రూపొందించేశాడు.