తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిక్కింలో ముగిసిన చామ్లింగ్ శకం!

సిక్కిం ఓటర్లు మార్పునకు పట్టం కట్టారు. వరుసగా 5 దఫాలు, 24 ఏళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పవన్ కుమార్ చామ్లింగ్ పార్టీ 32 స్థానాల అసెంబ్లీలో 15 సీట్లు మాత్రమే సాధించింది. సిక్కిం క్రాంతికారి మోర్చా 17 స్థానాలు సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

సిక్కింలో ముగిసిన చామ్లింగ్ తరం!

By

Published : May 24, 2019, 7:02 AM IST

సిక్కింలో ముగిసిన చామ్లింగ్ తరం!

ఈశాన్యాన చిన్న రాష్ట్రమైన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్​కేఎం) విజయం సాధించింది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించిన పవన్​చామ్లింగ్​ పార్టీ సిక్కిం డెమొక్రటిక్​ ఫ్రంట్​(ఎస్​డీఎఫ్​)32 స్థానాల సిక్కిం అసెంబ్లీలో15 సీట్లు మాత్రమే సాధించింది. ప్రత్యర్థి పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్​కేఎం)17 సీట్లు గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాలకుగాను ఎస్​డీఎఫ్​ 22 గెల్చుకోగా ఎస్​కేఎం 10 స్థానాల్లో విజయం సాధించింది. జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్​ల హవా ఇక్కడ తక్కువ.

పౌరసత్వ సవరణ బిల్లు, జాతీయ పౌర రిజస్టర్​ వివాదంతో రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితి నెలకొని ఉంది. ఈ అంశాలే ప్రచారాస్త్రాలుగా ప్రతిపక్షాలు ప్రచారం నిర్వహించాయి. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక లోక్​ సభ నియోజకవర్గంలో ఎస్​కేఎం విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details