తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్తార్​పుర్ నడవా వీడియోలో ఖలిస్థాన్ నేతలకు చోటు! - modi started kartharpur

కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ వీడియోను విడుదల చేసింది పాకిస్థాన్. అయితే ముగ్గురు ఖలిస్థాన్ వేర్పాటువాద నేతలకు ఈ వీడియోలో స్థానం కల్పించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కర్తార్​పుర్ నడవా వీడియోలో ఖలిస్థాన్ నేతలకు చోటు!

By

Published : Nov 6, 2019, 7:06 PM IST

దాయాది పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. కర్తార్‌పూర్‌ ఆధ్యాత్మిక నడవా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాక్​ సమాచార ప్రసార శాఖ విడుదల చేసిన ఓ వీడియోలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేతల చిత్రాలకు స్థానం కల్పించడం వివాదాస్పదంగా మారింది. ఖలిస్థాన్‌ వేర్పాటువాద నేతలు జర్నైల్‌ సింగ్‌ భింద్రాన్‌వాలే, షాబేగ్‌ సింగ్‌, అమ్రిక్‌ సింగ్‌ ఖల్సాకు చెందిన చిత్రాలు వీడియోలో కనిపించాయి. వీరంతా 1984లో భారత్​ సైన్యం స్వర్ణదేవాలయంలో నక్కిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్‌ బ్లూ స్టార్‌లో మరణించారు. వేర్పాటువాదుల అజెండాగా పిలిచే 2020 రిఫరెండానికి వీడియోలో చోటు కల్పించింది పాక్​.

పాక్‌లోని సిక్కు ప్రజల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే.. కీలక వీడియోలో ఖలిస్థాన్‌ నేతల పోస్టర్లు కనిపించేలా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సిక్కులు పాక్‌లోని పలు గురుద్వారాలను దర్శించుకున్నట్లు ఉన్న సన్నివేశాలతో వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియోలో పంజాబ్‌ మాజీమంత్రి, క్రికెటర్ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్​లకూ స్థానం కల్పించారు.

భారత్ అభ్యంతరం..

ఖలిస్థానీ వేర్పాటువాద నేత జర్నైల్ సింగ్ బింద్రేన్​వాలేకు కర్తార్​పుర్ నడవా ప్రారంభోత్సవ వీడియోలో స్థానం కల్పించడంపై దౌత్య మార్గాల ద్వారా అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్​. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

కర్తార్​పుర్ నడవా నిర్మాణంపై చర్చల సమయంలోనూ.. పాక్​ తరఫు నుంచి ఖలిస్థానీ వేర్పాటువాద నేతకు స్థానం కల్పించడంపై తీవ్రంగా ఆక్షేపించింది భారత్.

ఇదీ చూడండి: ఊరంతా ఏకమై పేడతో కొట్టుకున్నారు... ఎందుకో?

ABOUT THE AUTHOR

...view details