తెలంగాణ

telangana

By

Published : Sep 8, 2020, 10:08 PM IST

ETV Bharat / bharat

'రష్యా 'స్పుత్నిక్-వీ'​ ప్రతిపాదనకు అధిక ప్రాధాన్యం '

భారత్​లో 'స్పుత్నిక్ వీ'​ వ్యాక్సిన్​ మూడో దశ ట్రయల్స్​ నిర్వహించాలని, టీకాను తయారు చేయాలని ఇటీవలే రష్యా ప్రతిపాదించింది. తాజాగా జరిగిన చర్చల్లో ఈ అంశంపై కీలక పురోగతి సాధించినట్టు అధికారులు వెల్లడించారు. రష్యాతో ప్రత్యేక అనుబంధం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు పేర్కొన్నారు.

Significant movement' on Russia's request for phase-3 trial, manufacture of Sputnik V in India
'రష్యా 'స్పుత్నిక్'​ ప్రతిపాదనలో పురోగతి'

భారత్​లో స్పుత్నిక్​-వీ మూడో దశ ట్రయల్స్ నిర్వహణ​తో పాటు వ్యాక్సిన్​ను తయారు చేయాలన్న రష్యా ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై జరిగిన చర్చల్లో కీలక పురోగతి సాధించినట్టు.. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెలువడుతాయని పేర్కొన్నారు.

భారత్​తో ప్రత్యేక బంధం ఉన్న రష్యా నుంచి ఈ ప్రతిపాదన రావడం వల్ల.. ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు నీతి ఆయోగ్​(ఆరోగ్య) సభ్యుడు డా. వీకే పాల్​ తెలిపారు. స్పుత్నిక్​పై బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటాను శాస్త్రవేత్తలు పరిశీలించారని, మూడో దశ ట్రయల్స్​ జరపాల్సిన అవసరముందని వారు గుర్తించినట్టు పేర్కొన్నారు. భారత్​లోని అనేక సంస్థలు కూడా రష్యా ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.

ఒక వేళ రష్యా ప్రతిపాదనను అంగీకరిస్తే.. దేశానికి, ప్రపంచానికి మేలు జరుగుతుందని పాల్​ అభిప్రాయపడ్డారు.

తొలి టీకా...

ఆర్​డీఐఎఫ్​, గమలేయా ఔషధ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​ 'స్పుత్నిక్​-వీ'ని ఆగస్టు 11న విడుదల చేసింది రష్యా. ప్రపంచంలో విడుదలైన తొలి టీకాగా గుర్తింపు పొందింది. ఈ టీకా మంచి ఫలితాలు ఇస్తోందని 'ది లాన్సెట్'​ జర్నల్​ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్​పై ఆశలు రేకెత్తుతున్నాయి.

ఇదీ చూడండి:-ప్రజా పంపిణీకి రష్యా​ వ్యాక్సిన్- తొలిబ్యాచ్​ విడుదల

ABOUT THE AUTHOR

...view details