తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరోసారి చిక్కుల్లో కాంగ్రెస్​ నేత సిద్ధూ..

తన వ్యాఖ్యలతో మరోసారి చిక్కుల్లో పడ్డారు కాంగ్రెస్​ నేత, మాజీ క్రికెటర్​ నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కారణంగా ఈసీ మరోసారి సంజాయిషీ నోటీసులు జారీ చేసింది.

మరోసారి చిక్కుల్లో కాంగ్రెస్​ నేత సిద్ధూ

By

Published : May 10, 2019, 11:44 PM IST

Updated : May 11, 2019, 12:57 AM IST

మరోసారి చిక్కుల్లో కాంగ్రెస్​ నేత సిద్ధూ..

కాంగ్రెస్​ నేత, పంజాబ్​ మంత్రి నవ్​జోత్​ సింగ్​ సిద్దూకు ఎన్నికల సంఘం మరోసారి సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చౌకబారు ఆరోపణలు చేసి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని స్పష్టం చేసింది ఈసీ. ఈ షోకాజ్​ నోటీసులపై ఒక్కరోజులోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

మధ్యప్రదేశ్​లో ఏప్రిల్​ 29న నిర్వహించిన ర్యాలీలో సిద్ధూ... ప్రధాని మోదీని తక్కువచేసి మాట్లాడారని, రఫేల్​ అంశంలోనూ మోదీని విమర్శించారని రాష్ట్ర భాజపా విభాగం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. స్పందించిన అధికారులు.. ఆయనకు సంజాయిషీ నోటీసులు పంపించారు.

అంతకుముందూ సిద్ధూకు ఎన్నికల సంఘం షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. బిహార్​ ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేశారన్న కారణంతో.. 72 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉంచింది.

ఇదీ చూడండి:

సిద్ధూ ప్రచారంపై ఈసీ 3 రోజులు నిషేధం

Last Updated : May 11, 2019, 12:57 AM IST

ABOUT THE AUTHOR

...view details