కెఫే కాఫీ డే యజమాని, కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ అల్లుడు వి.జి. సిద్ధార్థ మృతిపై పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా స్పందించాడు. సిద్ధార్థ ఉదంతమే ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు నిదర్శనమని ఆరోపించాడు. తనని కూడా అలాగే వేధిస్తున్నారని చెప్పుకొచ్చాడు.
"నాకు వి.జి. సిద్ధార్థతో పరోక్ష సంబంధాలు ఉన్నాయి. మంచి వ్యక్తి. తెలివైన వ్యాపారవేత్త. తను రాసిన లేఖలోని అంశాలను చూసి నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎవరినైనా నిరాశలోకి నెట్టగలవు. బకాయిలన్నీ తిరిగి చెల్లిస్తానని చెబుతున్నప్పటికీ.. నా విషయంలో వారెలా వ్యవహరిస్తున్నారో చూడండి. అదే పాశ్చాత్య దేశాల్లో అయితే.. అప్పులను తిరిగి చెల్లించేందుకు సాయం చేస్తారు. కానీ నా విషయంలో మాత్రం చెల్లించడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను అడ్డుకుంటున్నారు"
-విజయ్ మాల్యా, కింగ్ఫిషర్ అధినేత
బ్యాంకులకు రూ.9 వేల కోట్ల అప్పు ఎగవేత కేసులో విజయ్ మాల్యా నిందితుడిగా ఉన్నాడు.