తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"రాహుల్​.. కర్ణాటకలో పోటీ చేయండి" - సోనియా

కర్ణాటకలోని లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీని కోరారు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య. గతంలో మాజీ ప్రధాని ఇందిర, సోనియా గాంధీ కన్నడనేల నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

సిద్దరామయ్య, రాహుల్​ గాంధీ

By

Published : Mar 15, 2019, 10:26 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ కర్ణాటకలోని లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నట్టు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు.

రాహుల్​ గాంధీని కాబోయే ప్రధానమంత్రి అంటూ.... దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, యూపీఏ చైర్​పర్సన్​ సోనియా గాంధీగతంలో కర్ణాటక నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ​రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ చేయాలని పార్టీ రాష్ట్రశ్రేణులన్నీ ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు సిద్దరామయ్య.

"కర్ణాటక ఎప్పుడూ కాంగ్రెస్​ పార్టీ అగ్రనేతలకు మద్దతుగా నిలుస్తోంది. ఇందిరాజీ, సోనియాజీ గెలిచినప్పుడే ఇది నిరూపితమైంది. దేశానికి కాబోయే తర్వాతి ప్రధానమంత్రి రాహుల్​ గాంధీ మా రాష్ట్రం నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నాం."

-- ట్విట్టర్​లో కర్ణాటక మాజీ సీఎంసిద్దరామయ్య

దివంగత మాజీ ప్రధానిఇందిరా గాంధీ 1978 ఉప ఎన్నికల్లోకర్ణాటకలోని చిక్కమాగళూరు లోక్​సభ స్థానం నుంచిపోటీ చేసి గెలుపొందారు. 1999లో ఇప్పటి యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ ఆ రాష్ట్రంలోని బళ్లారి నుంచి పోటీ చేశారు. అప్పటి భాజపా అభ్యర్థి అయిన సుష్మా స్వరాజ్​పై గెలుపొందారు.

సీట్ల పంపకాల్లో భాగంగా ఈసారి చిక్కమాగళూరు స్థానాన్ని జేడీఎస్​కు కేటాయించింది కాంగ్రెస్​. బళ్లారి నుంచి హస్తం పార్టీ అభ్యర్థే బరిలో దిగనున్నారు.

అమేథీతో పాటు దక్షిణాదిలోని ఏదైనా ఓ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయాలని రాహుల్​ గాంధీపై పార్టీలోని కొందరు నేతలు ఒత్తిడి తెస్తున్నారని కొంత కాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్దరామయ్య ట్వీట్లు చేయడం ఆసక్తికరంగా మారింది.

ఉత్తర్​ప్రదేశ్​లోని అమేథీ లోక్​సభ స్థానం నుంచి రాహుల్​ గాంధీ పోటీ చేయనున్నారని కాంగ్రెస్​ పార్టీ ఇటీవలే ప్రకటించింది. రాయ్​బరేలీ నుంచి సోనియా గాంధీ పోటీకి దిగుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details