తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక: మీడియాకు సిద్ధరామయ్య వార్నింగ్ - రెబల్స్

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి తానే ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించినట్లు వచ్చిన కథనాలను కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఖండించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు మరోమారు చేస్తే, తగిన రీతిలో సమాధానం చెబుతానని మీడియా సంస్థలను హెచ్చరించారు.

కర్ణాటక: మీడియాకు సిద్ధరామయ్య వార్నింగ్

By

Published : Jul 25, 2019, 6:43 PM IST

Updated : Jul 25, 2019, 10:42 PM IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మీడియా సంస్థలపై మండిపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తానే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించినట్లు వచ్చిన కథనాలను ఖండించారు.

"మీడియా... ఇలాంటి తప్పుడు వార్తలను అరికట్టాలని హెచ్చరిస్తున్నా. మరోమారు నా ముందు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన రీతిలో సమాధానం ఇస్తా."
-సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత

కర్ణాటక: మీడియాకు సిద్ధరామయ్య వార్నింగ్

నిజాలు నిలకడగా తెలుస్తాయ్​

తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయని... అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని అన్నారు.

కర్ణాటక: మీడియాకు సిద్ధరామయ్య వార్నింగ్

"తిరుగుబాటు ఎమ్మెల్యేలు నాపై నిందలు వేస్తున్నారు. అయితే ఈ వివాదం పరిష్కారం అయ్యాక వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. అపుడు వారు మట్టికరుస్తారు."
-సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత

కర్ణాటక: మీడియాకు సిద్ధరామయ్య వార్నింగ్

విశ్వనాథ్​ పంచ్​లు..

జేడీఎస్​ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి... తరువాత రెబల్ ఎమ్మెల్యేగా మారిన ఏ.హెచ్. విశ్వనాథ్... సిద్ధరామయ్యపై తీవ్రవిమర్శలు చేశారు.​ 'జేడీఎస్​ అధినేత హెచ్​డీ దేవెగౌడ... సిద్ధరామయ్యను ఎంతో నమ్మారు. అయితే తముకూరు నుంచి స్వయంగా లోక్​సభ ఎన్నికల బరిలో నిలిచిన ఆయనను ఓడించడానికి సిద్ధరామయ్య పనిచేశారు' అని విశ్వనాథ్​ ఆరోపించారు.

ఇదీ చూడండి: సమాచార హక్కుచట్ట సవరణపై రాజ్యసభలో రభస

Last Updated : Jul 25, 2019, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details