కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన వారిలో వృద్ధులదే అధిక వాటా. అరవై ఏళ్లకు పైబడిన వారే ఎక్కువగా మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. కర్ణాటకలోని ఓ వృద్ధురాలు కరోనాను విజయవంతంగా ఓడించింది. ఈ బామ్మ వయసు ఎంతో తెలుసా? ఏకంగా 110 ఏళ్లు.
వారం రోజుల్లోనే కరోనాను జయించిన 110 ఏళ్ల బామ్మ - corona latest news
కర్ణాటకకు చెందిన 110 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. ఏకంగా వారం రోజుల వ్యవధిలోనే వైరస్ నుంచి కోలుకొని ఔరా అనిపించింది. రాష్ట్రంలో కరోనా నుంచి బయటపడిన అతిపెద్ద వయస్కురాలు ఈమే.
వారం రోజుల్లోనే కరోనాను ఓడించిన 110 ఏళ్ల బామ్మ
రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన సిద్దమ్మ (110)కి జులై 27న కరోనా పాజిటివ్‌గా తేలింది. జిల్లా ఆస్పత్రిలో చేరిన ఆ వృద్ధురాలు వారం రోజుల్లోనే వైరస్ నుంచి కోలుకుంది. వైరస్ పరీక్షలో నెగిటివ్ వచ్చిన క్రమంలో ఆస్పత్రి నుంచి శనివారం డిశ్చార్జి చేసినట్లు జిల్లా వైద్యాధికారి బసవరాజ్ తెలిపారు.
ఇదీ చూడండి: విలయంలో ఉపశమనం- తగ్గుతున్న మరణాల రేటు
Last Updated : Aug 2, 2020, 8:13 AM IST