సామాజిక మధ్యమాల ద్వారా ప్రేమ జంటలు ఒక్కటవ్వడమే కాదు.. ఎన్నో ఏళ్ల క్రితం తప్పిపోయిన బంధువులు కూడా కలుసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లోని రాయ్‌సింగ్ నగర్లో చోటుచేసుకుంది. ఫేస్బుక్ సహాయంతో రంజిత్ సింగ్.. 72 ఏళ్ల తర్వాత తన చెల్లెల్ని కలుసుకున్నారు.
1947లో విడిపోయిన కుటుంబం...
1947లో కశ్మీర్ గిరిజన చొరబాట్ల జరిగాయి. ఆ గొడవల గందరగోళంలో రంజిత్ సింగ్ కుటుంబం విడిపోయింది. రంజిత్ తాత మత్వాల్ సింగ్, తన కుటుంబంతో కలిసి భారత్‌లో ఉండగా.. ఆయన 4ఏళ్ల సోదరి భజ్జో ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు.
ఇటీవలే.. రచయిత, సామాజిక కార్యకర్త రోమి శర్మ నిర్వహించిన సోషల్ మీడియా గ్రూప్ సాయంతో రంజిత్ తన సోదరి సమాచారం తెలుసుకున్నారు. 72ఏళ్ల అనంతరం ఇరువురు వీడియో కాల్ మాట్లాడుకున్నారు.