ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైన సియాచిన్‌ను పర్యటకుల సందర్శన కోసం తెరిచినట్లు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇందుకోసం లద్ధాఖ్‌లో శ్యోక్ నది మీదుగా నిర్మించిన వ్యూహాత్మక వంతెనను భారత సైనికాధిపతి బిపిన్ రావత్‌తో కలసిరాజ్నాథ్ ప్రారంభించారు. ఈ వంతెన శ్యోక్ నది నుంచి వెళ్తూ చైనా సరిహద్దు నియంత్రణ రేఖకు అనుసంధానంగా ఉండే బెగ్ ఓల్డీ సెక్టార్‌ను కలుపుతుంది.
‘లద్ధాఖ్‌లో మంచి పర్యటక ప్రదేశాలు ఉన్నాయి. పర్యటకులు అధిక సంఖ్యలో వచ్చేలా మార్గాలూ లద్ధాఖ్‌లో ఉన్నాయి. పర్యటకుల కోసం సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్ట్ వరకు మార్గాలను తెరిచాం’ అని ట్విట్టర్లో తెలిపారు రాజ్‌నాథ్.