తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్లాస్టిక్ రహిత భారతావనే గాంధీకి నిజమైన నివాళి' - పశువ్యాధి

భారత్​ను ప్లాస్టిక్​ రహిత దేశంగా మార్చేందుకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్​తో పర్యావరణానికి, పశు సంపదకు తీవ్ర హాని జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. పరిశుభ్రత, పశువుల్లో వ్యాధుల నియంత్రణకు సంబంధించి యూపీ మథురలో 2 కీలక కార్యక్రమాలు ప్రారంభించారు మోదీ.

'ప్లాస్టిక్ రహిత భారతావనే గాంధీకి నిజమైన నివాళి'

By

Published : Sep 11, 2019, 2:57 PM IST

Updated : Sep 30, 2019, 5:46 AM IST

'ప్లాస్టిక్ రహిత భారతావనే గాంధీకి నిజమైన నివాళి'

ప్లాస్టిక్​ భూతం కారణంగా పర్యావరణానికి, పశు సంపదకు తీవ్ర హాని జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు ప్రధాని నరేంద్రమోదీ. అలాంటి హానికారక ప్లాస్టిక్​ను ఉపయోగించడం మానేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

పశువుల్లో వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా జాతీయ పశువ్యాధి నియంత్రణ కార్యక్రమం(ఎన్​ఏడీసీపీ), వ్యర్థాల నుంచి ప్లాస్టిక్​ను వేరు చేసే 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమాలను మోదీ ఉత్తర్​ప్రదేశ్​ మథురలో ప్రారంభించారు. ప్లాస్టిక్ రహిత భారతావని నిర్మాణానికి ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

"పర్యావరణం, పశు సంపద భారత ఆర్థిక వ్యవస్థలో అతిముఖ్యమైన భాగాలు. ఈ కారణంగానే స్వచ్ఛ భారత్, జలజీవన్ మిషన్, రైతులు, పశుపోషకులకు ప్రోత్సాహం అందిస్తున్నాం. ప్రకృతి, ఆర్థిక అంశాల్లో సమతుల్యం ద్వారా మనం బలమైన నవ భారత నిర్మాణం వైపు దూసుకెళ్తున్నాం. పశువుల ఆరోగ్యం, పాలన, పోషణ, పాల డెయిరీకి సంబంధించిన అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టాం.

కొద్ది రోజుల తర్వాత గాంధీ 150వ జయంతిని జరుపుకోనున్నాం. ప్రకృతి పట్ల, స్వచ్ఛత పట్ల ఆయనకు ఉన్న ఆదరణను నేర్చుకుని, పాటించడం భారతీయులందరి కర్తవ్యం. మనం బాపూజీకి ఇచ్చే అసలైన నివాళి ఇదే. 'స్వచ్ఛతే సేవ' పథకం వెనుక కూడా గాంధీ భావాలున్నాయి. నేడు ప్రారంభమయ్యే ఈ పథకాన్ని ప్లాస్టిక్ రహిత భారత్​ను నిర్మించేందుకు అంకితం చేశాం."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

స్వచ్ఛతే సేవ...

'స్వచ్ఛతా హీ సేవ'ను ప్రారంభించిన అనంతరం అక్కడ పనిచేస్తున్న మహిళలతో సంభాషించారు ప్రధాని. వ్యర్థాల నుంచి ప్లాస్టిక్‌ వేరు చేసే పనిలో కాసేపు వారికి సాయం చేశారు.

వ్యాధి నియంత్రణకు టీకాలు...

ఎన్​ఏడీసీపీ పథకం ద్వారా కాలికుంటు వ్యాధి, బ్రూసిల్లోసిస్ నివారణ కోసం 50 కోట్ల పశువులకు టీకాలు వేయనుంది ప్రభుత్వం. 2024 వరకు రూ.12,652 కోట్లను ఈ పథకం కోసం ఖర్చు చేయనుంది. 2025 నాటికి ఈ వ్యాధులను నియంత్రించాలని, 2030 నాటికి పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది మోదీ సర్కార్.

ఇదీ చూడండి: గాంధీ 150 : 'ఆరోగ్యమే మనిషికి అసలైన ఆస్తి'

Last Updated : Sep 30, 2019, 5:46 AM IST

ABOUT THE AUTHOR

...view details