ఉత్తర్ప్రదేశ్ శ్రవస్తి జిల్లాలోని చారిత్రక డెన్ మహామన్కోల్ బౌద్ధ మందిరాన్ని మూసివేశారు. ప్రపంవ్యాప్తంగా రాకాసి కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఆలయ నిర్వాహకులు. ఆలయం బయట ఓ బోర్డును కూడా తగిలించారు.
నిత్యం వేలాదిమంది బౌద్ధ భక్తులు, విదేశి పర్యటకులతో నిత్యం కళకళలాడుతూ ఉండే ఈ మందిరాన్ని మూసివేయడం వల్ల గ్రామమంతా వెలవెలబోయింది. ఈ మందిరానికి చైనా, జపాన్, శ్రీలంక, మయన్మార్, బర్మా, థాయ్లాండ్ నుంచి వేలాది మంది పర్యటకలు వస్తుంటారు.
"ఈ చారిత్రక డెన్ మాహామన్కోల్ బౌద్ధ ఆలయానికి వేలాది మంది పర్యటకులు వస్తుంటారు. విదేశీ సంస్థలు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాపిస్తోన్న నేపథ్యంలో ఈ ఆలయాన్ని మూసివేశాం."