కర్ణాటక మంగళూరులోని పాడిల్ ప్రాంతం సమీపంలో శ్రామిక్ రైలు ఇంజిన్.. పట్టాలు తప్పింది. వలసకూలీల కోసం ఏర్పాటు చేసిన ఈ రైలు తిరూర్ నుంచి జైపుర్ వెళ్తుండగా.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు ఈ ఘటన జరిగింది.
పట్టాలు తప్పిన శ్రామిక్ రైలు.. అందరూ సేఫ్ - shramik latest news
కర్ణాటక మంగళూరులో వలసకూలీలు ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
పట్టాలు తప్పిన శ్రామిక్ రైలు ఇంజన్.. అందరూ సేఫ్
వెంటనే అప్రమత్తమైన అధికారులు ఇంజిన్ను మార్చారు. అనంతరం తెల్లవారుజామున 4.30 గంటలకు రైలు తిరిగి పయనమైంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.