తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మన ఛాపర్​ను మనమే కూల్చుకోవడం అతి పెద్ద తప్పు' - rakesh kumar singh on february 27

వైమానిక దళ 87వ వార్షికోత్సవం సందర్భంగా భారత్ గగనతన విజయాలను గుర్తు చేశారు వైమానిక దళాధిపతి రాకేశ్​ కుమార్ సింగ్ భదౌరియా. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయుసేన సిద్ధంగా ఉందన్నారు.

'ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం'

By

Published : Oct 4, 2019, 3:32 PM IST

'ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం'

ఫిబ్రవరి 27న కశ్మీర్​లో సొంత హెలికాఫ్టర్​ను కూల్చివేయడం వైమానిక దళం చేసిన అతిపెద్ద తప్పని అభిప్రాయపడ్డారు భారత వాయనసేన సారథి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా. సంబంధికులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైమానిక దళ 87వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. సెప్టెంబర్ 30న నూతన వైమానిక దళ సారథిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి మీడియాతో సంభాషించారు రాకేశ్​.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సర్వ సన్నద్ధంగా ఉందన్నారు భదౌరియా. బాలాకోట్ వైమానిక దాడులు సహా గతేడాది అనేక విజయాలు సాధించామని గుర్తుచేశారు.

"కొన్నేళ్లుగా వాయుసేన విశ్వసించదగిన దళంగా రూపాంతరం చెందిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మా సన్నద్ధత ఉత్తమ స్థాయిలో ఉంది. గత ఎనిమిది దశాబ్దాలుగా వాయుసేన అత్యంత సమర్థంగా తయారైంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఉత్తమ వాయుసేనలకు గట్టి పోటీదారుగా ఉంది.

గతేడాది వైమానిక దళం అనేక విజయాలు సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాలాకోట్​లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. తర్వాతి రోజు భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాకిస్థాన్ చేయాలనుకున్న దాడిని సమర్థంగా నిలువరించింది.

అప్పుడు జరిగిన వాయు ఘర్షణలో పాక్ దళం ఎఫ్​-16ని కోల్పోగా.. భారత్ మిగ్-21ని కోల్పోయింది. భారత రక్షణకు ప్రమాదంగా పరిణమించే ఎలాంటి దుశ్చర్యనైనా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సిద్ధంగా ఉంది. వైమానిక దళం గత 87 ఏళ్లుగా చేసిన పనులకు గర్విస్తోంది. గతమెంతో ఘనమని చూస్తూ కూర్చోం. వైమానిక దళాన్ని మరింత స్థిరంగా పటిష్ఠ పరచడమే మా ప్రాథమిక కర్తవ్యం."

- రాకేశ్​ కుమార్​ భదౌరియా, వాయుసేన సారథి

రఫేల్ యుద్ధవిమానం, ఎస్​-400 క్షిపణి వ్యవస్థ వైమానిక దళాన్ని మరింత పటిష్ఠపరుస్తాయన్నారు భదౌరియా. ఈ సమావేశంలో బాలాకోట్ వైమానిక దాడికి సంబంధించిన దృశ్యాలను ప్రదర్శించారు.

ఇదీ చూడండి: లంచం తీసుకున్నారని చెప్పులతో కొట్టిన మహిళలు..!

ABOUT THE AUTHOR

...view details