మధ్యప్రదేశ్ ఛింద్వాడాలోని అంబాడా పోలీస్ స్టేషన్లో ఓ వింత కేసు నమోదయింది. జామ్కుండా పంచాయతీ పరిధిలో ఓ రోడ్డు చోరీకి గురయిందని ఆ గ్రామానికి చెందిన రాకేశ్ ఖరే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాకేశ్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు గ్రామానికి వచ్చి తనిఖీ చేసి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. గ్రామానికి మంజూరైన సీసీ రోడ్డును పూర్తి చేసేలా సంబంధిత అధికారులతో మాట్లాడతామని చెప్పి వెళ్లిపోయారు.
ఇదీ జరిగింది..
జామ్కుండా గ్రామానికి 288 మీటర్ల సీసీ రోడ్డు మంజూరయింది. కేవలం 94 మీటర్లు నిర్మించి వదిలేశారు గుత్తేదారులు. ఈ విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించిన రాకేశ్‌కు.. నిర్మాణానికి సంబంధించిన పూర్తి నిధులను తీసుకున్నట్లు తెలిసింది. ఫలితంగా మిగిలిన 194 మీటర్ల రోడ్డు పోయిందని ఠాణాలో ఫిర్యాదు చేశాడు.