తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లాలోని ఓ స్కూల్ సమీపంలో బస్సు అదుపు తప్పి.. విద్యార్థినుల పైకి దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 11మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దారుణం: విద్యార్థినులపైకి దూసుకెళ్లిన బస్సు - తమిళనాడు బస్సు ప్రమాదం
విద్యార్థినులపై బస్సు దూసుకెళ్లిన ఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో చోటుచేసుకుంది. ఇందులో 11మంది గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డిసెంబర్ 11కు సంబంధించిన ఈ ఘటన దృశ్యాలు వైరల్గా మారాయి.
![దారుణం: విద్యార్థినులపైకి దూసుకెళ్లిన బస్సు tamilnadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5393812-thumbnail-3x2-tamil.jpg)
విద్యార్థినులపైకి దూసుకెళ్లిన బస్సు-సీసీటీవిలో దృశ్యాలు
విద్యార్థినులపైకి దూసుకెళ్లిన బస్సు-సీసీటీవిలో దృశ్యాలు
ఈ దుర్ఘటన దృశ్యాలు సీసీటీవి ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే ఈ ఘటన డిసెంబర్ 11న జరిగిందని సమాచారం.
ఇదీ చూడండి: దిల్లీ పోలీసుల చర్యపై భగ్గుమన్న విద్యార్థి లోకం