తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చికెన్​ షాపుకెళ్లి చెయ్యి తెగనరుక్కుని... - retired soldier chopping his hand

తమిళనాడుకు చెందిన ఓ రిటైర్డ్​ ఆర్మీ జవాన్​.. అనూహ్య ప్రవర్తన కలకలం రేపింది. ఓ చికెన్​ షాపుకెళ్లిన ఆయన.. మాంసాన్ని కోసే కత్తితో తన చెయ్యిని తెగనరుక్కున్నాడు. ఇది చూసిన షాపులోని వారు బెంబేలెత్తిపోయారు. అయితే భార్యతో విభేదాలే ఆయన ప్రవర్తనకు కారణమని తెలుస్తోంది.

Shocking CCTV shows a retired soldier chopping his hand
చికెన్​ షాపుకెళ్లి చెయ్యి తెగనరుక్కుని...

By

Published : Aug 27, 2020, 11:24 PM IST

చికెన్​ షాపుకెళ్లి చెయ్యి తెగనరుక్కుని...

ఓ రిటైర్డ్​ ఆర్మీ సైనికుడు.. చికెన్​ షాపుకెళ్లి అనూహ్యంగా తన చెయ్యిని తానే నరుక్కున్నాడు. తన రెండో చెయ్యిని కూడా నరికేయమని పక్కనే ఉన్న వారిని అభ్యర్థించాడు. ఆయన అనూహ్య ప్రవర్తనను చూసిన వారు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన తమిళనాడులోని థేని జిల్లాలో జరిగింది.

దంపతుల మధ్య విభేదాలతోనే?

వెంకటేశన్​.. థేని జిల్లాలోని కంబమ్​ ప్రాంత వాసి. ఆర్మీ నుంచి రిటైర్​ అయిన అనంతరం ఆయన కుటుంబంతో అక్కడే నివాసముంటున్నాడు. ఇదే సమయంలో దంపతుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో వెంకటేశన్​ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

అయితే గురువారం చికెన్​ షాపుకు వెళ్లిన వెంకటేశన్​ అనూహ్య రీతిలో ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అక్కడే ఉన్న మాంసాన్ని కొట్టే కత్తితో తన చెయ్యిని తెగనరుక్కున్నాడు. పక్కనే ఉన్న వారు ఈ సంఘటనతో బెంబేలెత్తిపోయి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇదే సమయంలో తన రెండో చెయ్యిని కూడా నరికెయ్యమని అక్కడి వారిని కోరాడు వెంకటేశ్​న్​. ఈ దృశ్యాలన్నీ షాపులోని సీసీటీవీ కెమెరాల్లో చిక్కాయి.

ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. వెంకటేశన్​ను థేని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వ్యవహారంపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంకటేశన్​ ప్రవర్తనకు గల కారణాలను తెలుసుకునేందుకు ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులను విచారిస్తున్నారు.

ఇదీ చూడండి:-రోడ్డు పక్కన పడుకున్న యాచకురాలిని చంపి.. ఆపై!

ABOUT THE AUTHOR

...view details