ఝార్ఖండ్ రాంచీ జిల్లా బహరటోలీలో విషాదం చోటుచేసుకుంది. జమ్ములో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తోన్న తన భర్త అకాల మరణాన్ని తట్టుకోలేక భార్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
భజరంగ్ భగత్, మణితలకు రెండేళ్ల క్రితం వివాహమైంది. భజరంగ్ జమ్ములో ఆర్మీ గార్డ్ రెజిమెంట్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తుండేవారు.
డిసెంబర్ 29 రాత్రి ఆయన తన భార్య, కుటుంబసభ్యులతో మాట్లాడారు. అయితే.. మరుసటి రోజే వారికి పిడుగులాంటి వార్త అందింది. భగత్ విధుల్లో ఉండగా మరణించారన్నది ఆ సమాచారం. తన భర్త అకాల మరణాన్ని తట్టుకోలేని మణిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు.
జీవనాధారం పోయింది..