తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నూడుల్స్ బండి కరెంట్ బిల్ రూ.1.82 కోట్లు! - Rs 1.82 crore current bill to a noodle sellerin meerut

రోడ్డు పక్కన నూడుల్స్ బండి పెట్టుకున్న ఓ చిరువ్యాపారికి షాక్ ఇచ్చింది ఉత్తర్ ప్రదేశ్ విద్యుత్ శాఖ. ఒక్క నెలకు అక్షరాలా రూ. 1.82 కోట్లు కరెంటు బిల్లు వేసి చేతికిచ్చింది. తన జీవితంలో ఒక కోటి రూపాయలను కళ్లారా చూసిందే లేదని, అలాంటిది అంత డబ్బు తాను ఎలా చెల్లించగలనని లబోదిబోమంటున్నాడు ఆ వ్యాపారి.

Shocked noodle seller gets Rs 1.82 crore power bill
నూడుల్స్ బండి కరెంటు బిల్లు రూ. 1.82 కోట్లు !

By

Published : Aug 17, 2020, 4:49 PM IST

ఉత్తర్ ప్రదేశ్​లో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మరోసారి వెలుగుచూసింది. మరో సామాన్యుడికి కరెంటు శాఖ వారి షాక్ తగిలింది. సాయంత్రం వేళ ఓ లైటు వెలుగులో వ్యాపారం చేసుకునే నూడుల్స్ బండి యజమాని ఖంగు తినేలా.. ఏకంగా రూ. 1.82 కోట్లు కరెంటు బిల్లు వచ్చింది.

మేరట్ ఆషియానా కాలనీకి చెందిన ఆస్ మహ్మద్ ఖాన్.. నూడుల్స్ వ్యాపారం చేస్తుంటాడు. సాధారణంగా వెయ్యి, రెండు వేలు వచ్చే కరెంటు బిల్లు.. ఈ సారి కోట్లల్లో వచ్చే సరికి విస్తుపోయాడు.

నూడుల్స్ వ్యాపారి ఆస్ మహ్మద్ ఖాన్

"నా నూడుల్స్ బండికి.. రెండు నెలలకు కలిపి రూ. 3410 బిల్లు వచ్చింది. బిల్లు చెల్లించడానికే నేను విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లాను. కానీ, అక్కడున్న సిబ్బంది నాకు రూ. 1 కోటి 82 లక్షల బిల్లు చేతికిచ్చారు. దీంతో ఈ బిల్లు లెక్క సరిచూడమని అధికారుల చుట్టూ తిరిగాను. కానీ, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. "

-ఆస్ మహ్మద్ ఖాన్

ఖాన్ ఒక్కడికే కాదు.. ఈ మధ్యకాలంలో యూపీ విద్యుత్ శాఖ షాకుల మీద షాకులిస్తుంది. వినియోగంతో సంబంధం లేని బిల్లులు చేతికిచ్చి జనం నిర్ఘాంతపోయేలా చేస్తోంది. హర్పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఏకంగా రూ. 1,28,45,95,444 బిల్లు అంటగట్టారు. మధ్యప్రదేశ్, సత్నా జిల్లాలో ఓ పనిమనిషి ఇంటి కరెంటు బిల్లు అక్షరాలా రూ. 1.25 లక్షలు.

ఇదీ చదవండి: సర్పంచ్​ పట్ల కుల వివక్ష- పతాక ఆవిష్కరణకు నిరాకరణ

ABOUT THE AUTHOR

...view details