తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎంపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివరాజే ఎందుకు?

కమల్​నాథ్​ రాజీనామాతో మరోసారి మధ్యప్రదేశ్​లో భాజపా సర్కార్​ కొలువుతీరేందుకు మార్గం సుగమం అయింది. సీఎంగా మళ్లీ శివరాజ్​ సింగ్​ చౌహాన్​కే పార్టీ అధిష్ఠానం అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయమే. మరి ఆయనే ఎందుకు?

By

Published : Mar 20, 2020, 4:01 PM IST

Madhya Pradesh
ఎంపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివరాజే ఎందుకు?

ఎమ్మెల్యేల మాయం, రాజీనామాలు, రాజకీయ సంక్షోభం, అనూహ్య పరిణామాల తర్వాత మధ్యప్రదేశ్​ సీఎం కమల్​నాథ్​ రాజీనామా చేశారు. కమల్​నాథ్​ రాజీనామా చేయడం వల్ల రాష్ట్రంలో భాజపా సర్కారు కొలువుతీరేందుకు మార్గం సుగమం అయింది. త్వరలోనే భాజపా ఎమ్మెల్యేలు సమావేశమై కొత్త శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. అయితే పార్టీ అధిష్ఠానం ఇప్పటివరకు ఈ పదవికి ఎవరి పేరునూ ప్రతిపాదించలేదు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి భాజపా సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపైనే.

శివరాజ్​ సింగ్​ చౌహాన్​... మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు మరోసారి ఆయనే రాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ పదవికి కేంద్రమంత్రి నరేంద్రసింగ్​ తోమర్​, రాష్ట్ర మాజీ మంత్రి నరోత్తమ్​ మిశ్రా పేర్లూ వినిపిస్తున్నాయి.

అధిష్ఠానం శివరాజ్​ వైపే మొగ్గుచూపుతుందని పార్టీలో చాలామంది విశ్వసిస్తున్నారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.

  • రాష్ట్రంలో చౌహాన్​ కన్నా ప్రజాకర్షణ నేత భాజపాలోనే లేరు.
  • ఆయనకు ఆర్​ఎస్​ఎస్​తో మంచి సంబంధాలు ఉన్నాయి.
  • శివరాజ్​ నాయకత్వంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ.. కాంగ్రెస్​ కన్నా ఎక్కువ ఓట్లను సాధించింది.
  • 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో త్వరలో రాష్ట్రంలో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి శివరాజ్​ను మించిన నేత లేరని పార్టీలో చాలా మంది విశ్వసిస్తున్నారు.
  • నిమ్న వర్గాల నుంచి వచ్చి రాష్ట్ర సీఎంగా 2018 వరకు వరుసగా 13 సంవత్సరాలు చౌహాన్​ పాలించారు.
  • ఆయన కార్యదీక్ష కారణంగానే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి అప్పజెప్పింది భాజపా అధిష్ఠానం.
  • ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఎదురీదిన నేపథ్యంలో స్థానికంగా పట్టున్న నాయకులకు పదవులు ఇచ్చి ప్రోత్సహించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.
  • కాంగ్రెస్​కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు​ రాజీనామాలు చేసిన వెంటనే రాజకీయ వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు చౌహాన్​.

వీటన్నింటి కారణంగానే మరోసారి మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా శివరాజ్​ సింగ్​కు అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇదీ చూడండి: కమల్​నాథ్​ రాజీనామా- ఎంపీలో ఇక కమలం సర్కార్​!

ABOUT THE AUTHOR

...view details