తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డీకే శివకుమార్​కు మద్దతుగా కర్ణాటకలో ఆందోళనలు - కర్ణాటక

కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్​ అరెస్ట్​కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు ఒక్కలిగ సామాజిక వర్గం ప్రజలు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు.

డీకే శివకుమార్​కు మద్దతుగా కర్ణాటకలో ఆందోళనలు

By

Published : Sep 11, 2019, 4:43 PM IST

Updated : Sep 30, 2019, 6:07 AM IST

డీకే శివకుమార్​కు మద్దతుగా కర్ణాటకలో ఆందోళనలు
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత డీకే శివకుమార్​ అరెస్ట్​పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆయనకు మద్దతుగా వేల మంది ఒక్కలిగ సామాజిక వర్గం ప్రజలు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేపట్టారు.

'ఛలో రాజ్​భవన్' పిలుపుతో బెంగళూరులో వందల మంది నిరసనల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్​, జేడీఎస్​ మద్దతుతో బెంగళూరులోని నేషనల్​ కళాశాల మైదానం నుంచి ఫ్రీడమ్​ పార్క్​ వరకు, అక్కడి నుంచి రాజ్​భవన్​ వరకు ర్యాలీ నిర్వహించారు. శివకుమార్​కు మద్దతుగా ప్లకార్డులు, ఆయన ఫోటోలు పట్టుకుని భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ర్యాలీ చేపడుతున్న ప్రాంతాల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.

మద్దతుదారులకు కృతజ్ఞతలు..

తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నాయకులు, నిరసనకారులకు కృతజ్ఞతలు తెలిపారు శివకుమార్​. ఆందోళనలు శాంతియుతంగా చేపట్టాలని కోరారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఉద్ఘాటించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని.. న్యాయవ్యస్థపై తనకు పూర్తి నమ్మకముందని ట్వీట్​ చేశారు డీకే.

శివకుమార్​ ట్వీట్​

ఈనెల 3న అరెస్ట్​...

డీకే శివకుమార్​ను ఈనెల 3న మనీలాండరింగ్​ కేసులో అరెస్ట్​ చేసింది ఎన్స్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఆయన కుమార్తెకూ సమన్లు జారీ చేసింది ఈడీ. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: రైతులు, చిరు వ్యాపారులకు పింఛను రేపటి నుంచే!

Last Updated : Sep 30, 2019, 6:07 AM IST

ABOUT THE AUTHOR

...view details